ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.కోటి మంజూరు: కలెక్టర్ - AP STATE COVID -19

చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్​ నారాయణ భరత్​ గుప్తా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు మరో కోటి రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు.

state government allocated another 1 crore to chitoor district
కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.కోటి మంజూరు : చిత్తూరు కలెక్టర్

By

Published : Jun 28, 2020, 10:59 PM IST

చిత్తూరు జిల్లాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలన్నారు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1300 దాటిందన్నారు. రోజుకు 50 నుంచి 95 వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు మరో కోటి రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు.

ఇందులో మొదటి విడతగా తితిదే ఆధ్వర్యంలో ఉన్న శ్రీనివాస వసతి సముదాయం, రెండో విడతగా విష్ణునివాసం సముదాయాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details