తిరుమలలో డిక్లరేషన్, ఆగమశాస్త్ర నిబంధనలను సరిగ్గా పాటించట్లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తితిదే అధికారులు నిబంధనలను పాటించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
పూజాకార్యక్రమాలకు తమకు సంబంధం ఏముంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు సమయం కావాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా పడింది.