ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RUYA incident: గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం - RUYA incident

గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టుకు నివేదించింది. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని చెప్పింది. అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Ruya Hospital incident
Ruya Hospital incident

By

Published : Jul 13, 2021, 4:59 PM IST

Updated : Jul 14, 2021, 3:46 AM IST

ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ బాధితులు కన్నుమూ శారని చిత్తూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది . ఆక్సిజన్ సరఫరాలో పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ ఆసుపత్రిలో పనిచేయలేదని వివరించింది . కలెక్టర్ ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని ప్రభుత్వ న్యాయవాది టి.బాలస్వామి తెలిపారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. అఫిడవిట్ వేయాలని ఆదేశించింది . విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 40 మందికి పైగా కొవిడ్ బాధితులు కన్నుమూశారని , ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు , ఆసుపత్రి యాజమాన్యపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ , తెదేపా నేత పవార్ మోహన్ రావు( సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు) హైకోర్టులో పిల్ వేశారు . బాధ్యులపై కేసు నమోదు చేయాలని అలిపిరి ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు . రుయా ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లు కలెక్టర్ తేల్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటీషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా కోరారు . విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చి .. రుయా ఘటనలో కన్నుమూసిన వారికి తక్కువ పరిహారం ఇవ్వడం వివక్ష చూపడమేనన్నారు.

Last Updated : Jul 14, 2021, 3:46 AM IST

ABOUT THE AUTHOR

...view details