ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపాం..! - poling
అతి తక్కువ బలగాలతో... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తిరుపతి ఎస్పీ అన్బురాజ్ తెలిపారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూశామని.. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజ్ తెలిపారు. అందుబాటులో ఉన్న అతి తక్కువ బలగాలతోనే... ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన...పోలింగ్ బూత్లు ఓటర్ల శాతం పెరిగినా... కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. 2014తో పోలిస్తే... అందుబాటులో ఉన్న పోలీసులు, బలగాల సంఖ్య తక్కువగా ఉన్నా...పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించామని తెలిపారు.