ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘వైకాపా ప్రభుత్వం వలస కూలీలను నిర్లక్ష్యం చేస్తోంది' - వలస కూలీలపై భాజపా నాయకులు

వైకాపా ప్రభుత్వం వలస కూలీలను నిర్లక్ష్యం చేస్తోందని భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శాంతా రెడ్డి  అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వారి కోసం వినియోగించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ap bjp leaders on maigrants
వలస కూలీలపై భాజపా నాయకులు

By

Published : May 14, 2020, 1:47 PM IST

రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శాంతా రెడ్డి ఆరోపించారు. లాక్ డౌన్ విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం 800 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వలస కూలీలకు అందులో నుంచి కనీసం చెప్పులు, గంజి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చిన్న పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షణీయమని శాంతా రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details