తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పట్టణంలో పోలింగ్‌కు సంబంధించి వచ్చిన కొన్ని ఫిర్యాదులపై పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. సచివాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సీఈఓ విజయానంద్ పరిశీలించారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది: విజయానంద్ - తిరుపతి ఉపఎన్నికలపై సీఈఓ వ్యాఖ్యలు
తిరుపతి ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె. విజయానంద్ అన్నారు. తిరుపతి పట్టణం పరిధిలో వచ్చిన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Andhra pradesh state chief election officer vijayanandh on Tirupati by election
Last Updated : Apr 17, 2021, 6:59 PM IST