తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి పది వేల రూపాయలు వసూలు చేస్తున్న తితిదే.. వాటిని ఎక్కడ ఖర్చుపెడుతుందో చెప్పాలని భాజపా నేత ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. తిరుపతిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ జాగృతి వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని విమర్శించారు. అవన్నీ వైకాపా ప్రభుత్వ గుప్పెట్లోనే ఉన్నాయన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే పరిస్థితుల్లో మార్పులు వస్తాయన్నారు.
'హిందూ ధర్మపరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?' - Iyr krishna rao comemtns on TTD
హిందూ ధర్మపరిరక్షణ కోసం వైకాపా ప్రభుత్వం ఏం చేస్తోందని భాజపా నేత ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. హిందూ మత సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయని అన్నారు. తిరుపతిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులను తితిదే ఏం చేస్తోందని కృష్ణారావు నిలదీశారు. ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని విమర్శించారు.
andhra pradesh ex cs comments on ysrcp government on conversation of Hindu institutes