Macro Photography: చదువులు, ఉద్యోగాలే లక్ష్యంగా జీవిస్తున్న యువతలో చాలా మందికి.. తమతో పాటే ఈ భూమిపై జీవించే చాలా జీవుల గురించి తెలియదు. తూనీగలు, సీతాకోక చిలుకలు, సాలెపురుగుల వంటి క్రిమి, కీటకాలను వీడియోలు, ఫోటోల్లో చూడడమే తప్ప.. ప్రత్యేకంగా చూసిందే లేదు. తిరుపతికి చెందిన ఈ యువకుడు అలా కాదు... స్మూక్ష్మ క్రిమికీటకాల్ని సరికొత్త రూపంలో ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు.
తిరుపతి నగరంలోనే ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించిన ఈనేష్.. శ్రీ విద్యానికేతన్ లో బీఎస్సీ మైక్రోబయాలజీ చదివాడు. తర్వాత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్‌గానూ పనిచేశాడు. ఈ సమయంలోనే స్పై క్రియేషన్స్ అనే ఓ సంస్థ నిర్వహించిన ఫోటోవాక్‌లో పాల్గొన్న సిద్ధార్థ్.. మాక్రో ఫోటోగ్రఫీ గురించి తెలుసుకున్నాడు. దానిపై తెలియకుండానే మక్కువ పెరిగిపోయింది.
" మాక్రో ఫొటోగ్రఫీకి పెద్ద నిర్వచనమే ఉంది. అయితే వాడుక భాషలో చెప్పాలంటే...దోమలు,ఈగలు వంటి కీటకాలు ఎలా ఉంటాయో చూపించడమే మాక్రో ఫొటోగ్రఫీ. ఒకసారి స్నేహితులు ఇచ్చిన లెన్స్ తో సీతాకాకో చిలుక చిత్రం తీశాను. అది నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి దాదాపు 60కి పైగా కీటకాల చిత్రాలను ఇక్కడి దగ్గర ప్రాంతాల్లోనే చిత్రీకరించాను." - ఈనేష్ సిద్ధార్థ్, వైల్డ్‌లైఫ్ మైక్రో ఫోట్రోగ్రాఫర్
ఇదీ చదవండి:Farmers Problem: మేము ఏం చేయాలి.. మాకు దారేది.. రైతుల ఆవేదన
Photography on Insects :ఇష్టాన్ని వదులుకోని సిద్ధార్థ్.... రోజుల తరబడి అడవులు పట్టుకొని తిరుగుతూ గంటల తరబడి కీటకాల వెంటపడుతూ అరుదైన చిత్రాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేస్తాడు. పురుగులు, కీటకాల కోసం సిద్ధార్థ్ ప్రయత్నాలు చూసి... మిత్రులు, సహచరులు నవ్వుకొనే వాళ్లు, ప్రారంభంలో ఇంట్లో వాళ్లు సైతం ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెబుతుండే వాళ్లు. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా... తనకిష్టమైన కళను కొనసాగించాడు.
2 సంవత్సరాలు శేషాచలం అటవీ ప్రాంతంలో తిరుగుతూ తూనీగలు, సీతాకోక చిలుకల అరుదైన ఫోటోల్ని తీశాడు.... సిద్ధార్థ్. పడగ విప్పిన ఆడుతున్న పాము, కంటిమీద పడిన నీటి బొట్టును తన కాలితో తుడుచుకొంటున్న తూనీగా ఇలా.. ఈ కుర్రాడు తీసిన చిత్రాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మధ్య తరగతి కుటుంబమైనా....వేల రూపాయల కెమెరాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థితి లేకపోయినా పరిమిత వనరులతోనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీలో మాక్రో విభాగంలో అద్భుత చిత్రాల్ని తన ఫోన్‌లోనే బంధిస్తున్నాడు ఈ యువకుడు.