తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పార్టీకి ఓటమి ఖాయమని అర్థమై..రాళ్లదాడి డ్రామాకు తెరలేపారని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ ఉపఎన్నికలో తెదేపాకు 30 శాతంలోపే ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.
పవన్ క్వారంటైన్‌కు వెళ్లింది కరోనాకు భయపడా..? డబ్బు అందకా ? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా.. భాజపా అధ్యక్షుడి నుంచి తెదేపా అధ్యక్షుడి స్థాయికి దిగజారన్నారు. నడ్డా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రైవేట్ పోర్టులో షేర్లను అదానీ కొంటే వైకాపాకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. మోదీని జగన్ పలుసార్లు కలిసినా.. కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదన్నారు.