Amaravati Farmers Maha Padayatra:అమరావతి రైతుల మహాపాదయాత్ర గమ్యం చేరింది. 44 రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. అమరావతి నుంచి తిరుపతి చేరారు. ఒకటిన్నర నెలకిందట యాత్రకు బయల్దేరిన నాటి నుంచి .. అడుగడుగునా అడ్డుంకులు ఎదురయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఆంక్షలు, కేసులు కూడా నమోదు చేశారు! వీటన్నింటినీ ఎదురొడ్డుతూనే ముందుకు సాగారు రైతన్నలు.
Amaravati Farmers Maha Padayatra: గమ్యం చేరిన అమరావతి రైతులు.. అలిపిరిలో ముగిసిన 'మహా పాదయాత్ర' - three capitals for AP news
15:44 December 14
ఎండా వానలకు ఓర్చారు..! అడుగడునా అడ్డంకులను ఎదురొడ్డారు..! కొన్నిచోట్ల తినడానికి స్థలానికీ అనుమతి దక్కలేదు! ఇన్ని సవాళ్లున్నా....ఎక్కడికక్కడ పూలవానతో ముందుకు కదిలిన అమరావతి మహాపాదయాత్ర... తుదిగా న్యాయస్థానం నుంచి దేవస్థానం చేరింది.
nyayasthanam to devasthanam: నవంబర్ 1న తుళ్లూరు నుంచి 'న్యాయస్థానం- దేవస్థానం' పేరుతో యాత్ర చేపట్టిన రైతులు .. ఆ తర్వాత గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు దాటారు. చిత్తూరు జిల్లాలోనూ అంతటి అపూర్వ స్వాగతం దక్కదేమోనని రైతులు సందేహిస్తే... అక్కడా పూలబాటే పరిచారు స్థానికులు. అనుకున్నట్లే.. శ్రీవారి పాదాల చెంతకు చేరారు. తిరుపతి నగరంలోనే 9 కి.మీ పాటు యాత్ర కొనసాగింది. దాదాపు 450కి.మీ మేర కాలినడకన వచ్చిన కర్షకులు.. చివరిగా కొబ్బరికాయలు కొట్టి తమ యాత్రను ముగించారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న తమకు.. వివిధ జిల్లాల్లోని ప్రజలు సంఘీభావం తెలపటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
Amaravati Farmers Public Meeting at Tirupati: రేపటి నుంచి మూడు రోజులపాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. తితిదే నియమనిబంధనలను అనుసరించి తాము నడుచుకుంటామని రైతులు స్పష్టం చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగాని లోనయ్యారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17వ తేదీన తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి
Old Age Pensions Hike in AP: జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు