Amaravati congress: తిరుపతి రైతుల మహా సభపై పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. తెదేపా నేతలే లక్ష్యంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుండి తెలుగుదేశం నేతలు తిరుపతి రాకుండా పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతామని జేఏసి నేతలు స్పష్టం చేశారు.
Amaravati Congress: సభకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు: రైతులు - తిరుపతిలో అమరావతి రైతుల సభ
Amaravati Congress: తిరుపతిలో అమరావతి రైతుల మహాసభకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు, వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు.
Amaravati farmers