కరోనా విపత్కర సమయంలో అధికారులు, సిబ్బంది చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కురుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్ష హోదాలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. కమిషనర్ గిరీష్, అర్భన్ ఎస్పీ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మహమ్మారి సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యులు, పోలీసు, నగరపాలక సంస్థ సిబ్బంది అందించిన సేవలను ఎమ్మెల్యే భూమన కొనియాడారు. మానసవికాస వేదిక ఆధ్వర్యంలో వారందరినీ ఘనంగా సన్మానించారు.