తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ. రమణ దీక్షితులు ఎంపీ వీ.విజయసాయిరెడ్డిపై తితిదే 2018లో పరువు నష్టం దావా దాఖలుచేసింది. ప్రస్తుతం ఆ దావా తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్సు కోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 14న ఈ దావాలో తెలంగాణకు చెందిన హిందూ జనసేన శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 14న తితిదే దావా ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసిన విషయం బయటపడింది. ఇంప్లీడ్ పిటిషన్లో తితిదే, ఎ.వి రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తితిదే పిటిషన్ విచారణ వాయిదా - తితిదే పరువునష్టం దావా తాజా వార్తలు
తితిదే దాఖలు చేసిన పరువునష్టం దావా ఉపసంహరణ పిటిషన్పై విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసినట్లు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ తెలిపారు.
తితిదే పిటిషన్ విచారణ వాయిదా