తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
13:31 October 06
TTD : తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటీషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
అధికార పార్టీతో నేరుగా రాజకీయ సంబంధాలు , క్రిమినల్ కేసులున్న కొందరిని తితిదే పాలక మండలి సభ్యులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాయకుడు , తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది . 18 మంది సభ్యుల పేర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది . వారిని ప్రతివాదులుగా చేర్చింది . విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది .
ఇదీ చదవండి :
TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ