ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు.. వసతి కష్టాలు - తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు

శ్రీవారిని దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు వసతి కష్టాలు తప్పడం లేదు. భక్తుల సౌకర్యం పేరుతో అమలుచేస్తున్న కరెంటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత కష్టాల పాలుచేస్తోంది. తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కరెంటు రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద పేర్లు నమోదు చేసుకున్నా వసతి గదులు దొరక్క చెట్లకింద సేదతీరాల్సిన పరిస్థితి నెలకొంది.

Tirumala
Tirumala

By

Published : May 24, 2022, 5:55 AM IST

తిరుమలకు వచ్చే భక్తులకు.. వసతి కష్టాలు

వేసవి సెలవులతోపాటు...కొందరు విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు....తిరుమలో వసతి గదుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తిరుమల కొండపై.... పరిమిత సంఖ్యలో ఉన్న వసతి గదులను.. కరెంటు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు కేటాయిస్తున్నారు. కరెంటు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల ఫోన్లకు వసతి గది కేటాయింపు వివరాలతో సంక్షిప్త సందేశం వచ్చేలా తితిదే ఏర్పాట్లు చేసింది. అయితే...రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భక్తులకు సంక్షిప్త సందేశాలు ఆలస్యంగా వస్తున్నాయి.

తితిదే కార్యాలయంలో గదిని కేటాయిస్తూ...జనరేట్‌ అయిన మెసేజ్‌ భక్తుల ఫోన్‌కు వచ్చే సరికి రెండు నుంచి మూడు గంటలు ఆలస్యమవుతోంది. తమ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిన తర్వాత భక్తులు విచారణ కార్యాలయానికి గది కోసం వెలుతున్నారు. అప్పటికే రెండు గంటలు దాటిపోవడంతో గది కేటాయింపు రద్దయిపోతోంది. సర్వర్‌ సమస్యలు, సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల సందేశాలు ఆలస్యంగా వస్తుండంతో భక్తులు గదులు పొందలేక మరోసారి కరెంటు రిజిస్ట్రేషన్ కోసం వరుసల్లో నిలబడి నమోదు చేసుకోవాల్సి వస్తోంది.
సర్వర్‌ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు సాకుగా చూపుతూ తితిదే అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు రిజిస్ట్రేషన్‌ విధానం రద్దు చేసి పాత పద్దతిలో ముందుగా వరుసల్లో నిలబడిన వారికి గదులు కేటాయించే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. వసతి గదుల కరెంటు రిజిస్ట్రేషన్‌ విధానంలో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. లేకుంటే పాత విధానం అమలు చేయాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్

ABOUT THE AUTHOR

...view details