తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరీక్ష పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన పత్రాలు డిగ్రీ సెమిస్టర్ పత్రాలుగా అధికారులు గుర్తించారు. మొత్తం 109 కళాశాలలకు చెందిన 70 వేల మంది విద్యార్థుల జవాబు పత్రాలు అపహరణకు గురయ్యాయి. పేపర్ల దొంగతనంపై ఎస్వీ విశ్వవిద్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణిగుంట పాత పేపర్ల విక్రయ దుకాణంలో పరీక్ష పత్రాలు లభ్యం కావటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎస్వీ యూనివర్సిటీ పరీక్ష పత్రాలు ఎత్తుకెళ్లిన దొంగలు - svu exam papers chory news
ఎస్వీ విశ్వవిద్యాలయం పరీక్ష పత్రాలను దుండగులు అపహరించారు. దీనిపై వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్వీ యూనివర్సిటీ పరీక్ష పత్రాలు ఎత్తుకెళ్లిన దొంగలు
TAGGED:
sv university latest news