ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SNAKE: బీరువాలో నక్కింది... ఎంతకూ బయటకు రానంది - తిరుమలలో పాము కలకలం

తిరుమలలోని ఓ హోటలో పాము కలకలం సృష్టించింది. బీరువాలో దూరిన పాము.. ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

బీరువాలో పాము కలకలం
బీరువాలో పాము కలకలం

By

Published : Sep 14, 2021, 9:58 PM IST

తిరుమలలోని ఓ హోటల్​లో పాము హల్​చల్ చేసింది. వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద గల హోటల్​లో బీరువాలోకి నాగుపాము దూరింది. గమనించిన హోటల్ నిర్వాహకులు దానిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఎంతకూ పాము బీరువా నుంచి బయటకు రాకపోవడంతో.. పాములు పట్టే అటవీ విభాగం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సర్పాన్ని బయటికి తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

బీరువాలో పాము కలకలం

ABOUT THE AUTHOR

...view details