చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో వరుస ప్రమాదాలు జరిగాయి. కర్ణాటక నుంచి తిరుపతికి వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వెనక అతివేగంగా వస్తున్న రెండు లారీలు సైతం బోల్తాపడ్డాయి. మొత్తం మూడు లారీలు బోల్తాపడటంతో ...ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
చంద్రగిరిలో వరుస ప్రమాదాలు...ఇద్దరి పరిస్థితి విషమం - chandragiri road accident news
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో వరుస ప్రమాదాలు సంభవించాయి. మూడు లారీలు, ఒక కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
చంద్రగిరిలో వరుస ప్రమాదాలు
Last Updated : Oct 16, 2020, 12:11 PM IST