తిరుపతిలోని రుయా ఆసుపత్రి ప్రాంగణంలో దీనస్థితిలో ఉన్న చిన్నమ్మ (85) అనే వృద్ధురాలికి మనీ అనే హమాలీ కార్మికుడు సాయం అందించాడు. నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఆకలితో అలమటిస్తున్న చిన్నమ్మకి భోజనం తినిపించాడు.
వృద్ధురాలికి భోజనం తినిపించి మానవత్వం చాటుకున్న వ్యక్తి - ruya hospital latest news
పిల్లల ఆలనా పాలనా చూస్తూ అపురూపంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఆ పిల్లలు పెద్దయ్యాక.. వయసైపోయిన తల్లిదండ్రులను ఆదరించటం మరిచిపోతున్నారు. కట్టుకున్న వాడు కాలం చేసి.. కుమారుడూ పట్టించుకోక దయనీయ పరిస్థితుల్లో ఉంది ఆ వృద్ధురాలు. ఆకలికి అలమటిస్తున్న ఆ పెద్దావిడకు అన్నం తినిపించి మానవత్వాన్ని చాటుకున్నాడో వ్యక్తి.
వృద్ధురాలికి భోజనం తినిపిస్తున్న వ్యక్తి
కర్ణాటకలోని ముల్బాగల్కు చెందిన చిన్నమ్మకు కుమారుడు, కోడలు ఉన్నారు. భర్త మునస్వామి చనిపోయాక.. తన కుమారుడు ఆమెను చూసుకోవటం మానేశాడు. అక్కడా.. ఇక్కడా తిరుగుతూ.. ఆ వృద్ధురాలు తిరుపతి చేరుకుంది. చిత్తూరుకి చెందిన మనీ అనే వ్యక్తికి రుయా ఆసుపత్రి ఆవరణలో దయనీయంగా కనిపించింది. కూర్చోటానికి కూడా ఒంట్లో సత్తువ లేని ఆమెకు ఆహారం, నీళ్లు అందించాడు.
ఇదీ చదవండి:ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన పెంచుతున్న కరోనా ఉద్ధృతి