పాము కాటుతో బాలుడు మృతి.. ద్విచక్రవాహనంపై మృతదేహం తరలింపు - తిరుపతి జిల్లాలో అంబులెన్స్ మాఫియా
15:24 October 11
కేవీబీపురం మండలంలో పాముకాటుతో బాలుడు మృతి
Boy dies of snakebite: తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. బాలుడు పాముకాటుతో మృతి చెందగా.. మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ వాహన యజమానులు నిరాకరించారు. దీంతో తండ్రి బైక్పై కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం దిగువ పుత్తూరు గ్రామంలో బసవయ్య అనే ఏడేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము కాటేసింది. బాలుడిని కేవీబీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లేసరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహన యజమానులు నిరాకరించడంతో.. తండ్రి చంచయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తన స్వగ్రామానికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు లేకపోవడం వల్లే.. ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: