- నిలకడగా...
రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రైతులకు నష్టం ఉండదు'
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఇక నుంచి పంట ఉత్పత్తుల విక్రయంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉద్ధృతంగా నిరసనలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 295వ రోజుకు చేరుకున్నాయి. మందడంలో మహిళలు భగవద్గీత శ్లోకాలు చదువుతూ నిరసనను తెలియజేశారు. మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఐనవోలులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దురాగతం
ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది. రక్తమాంసలు పంచి.. జన్మనిచ్చిన కుమారుడిని ప్రియుడి కోసం వద్దనుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఎలాగైనా .. తొలగించాలనుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 5జీ డీల్ ఖరారు
భారత్, జపాన్ మధ్య 5జీ, కృత్రిమ మేధ సాంకేతికతల సహకారానికి సంబంధించి కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరో అవగాహనా కార్యక్రమం