Annamacharya Vardhanthi Mahotsav: తాళ్లపాక అన్నమాచార్యుని 519వ వర్థంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అలిపిరి మెట్ల మార్గం వద్ద సంప్రదాయ మెట్లోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పండితులు ఉత్సవాలను ప్రారంభించారు. మెట్లోత్సవ కార్యక్రమంలో తితిదే జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భజన బృందాలు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌లోని కళాకారుల సంకీర్తనలతో అలిపిరి మార్గం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఘనంగా ప్రారంభమైన అన్నమాచార్యుని వర్ధంతి మహోత్సవాలు - AP news
Annamacharya Vardhanthi Mahotsav: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుని 519వ వర్థంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల సంకీర్తనలతో.. అలిపిరి మార్గం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Annamacharya Vardhanthi Mahotsav
అలిపిరి పాదాల మండపం నుంచి భజన బృందాలు సంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు. వర్థంతి ఉత్సవాలను పురస్కరించుకుని తితిదే, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు తిరుమల, తిరుపతి, తాళ్లపాకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఇదీ చదవండి:Governor: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు