తిరుమల శ్రీవారిని 1500 మంది గిరిజనులు దర్శించుకున్నారు. విశాఖ శ్రీశారదాపీఠం ఆధ్వర్యంలో హరిజన, గిరిజనులకు తితిదే దర్శనం కల్పించింది. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరందరూ... యాత్రి సదన్‌లో బస చేశారు. తలనీలాలు సమర్పించి ఈ ఉదయం మెుక్కులు చెల్లించుకున్నారు.
భారతీయ సంస్కృతి, జీవన విధానం, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి... హిందూ ధర్మప్రచార యాత్రను నిర్వహించారని ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 33 వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించామని... ముగింపులో గిరిజన, హరిజనులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.