ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

15 వేల జ్యూస్​ ప్యాకెట్లు ఉచితంగా ఇంటింటికి పంపిణీ - తిరుపతిలో ఆపిల్​ జ్యూస్​ ప్యాకెట్లు పంపిణీ

తిరుపతిలో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ సభ్యులు ప్రజలకు 15 వేల జ్యూస్​ ప్యాకెట్లను ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆ సంస్థ అధ్యక్షుడు తెలిపారు.

15 thousand apple juice packets distributed in tirupati
మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి

By

Published : Jul 19, 2020, 11:56 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆపిల్ జ్యూస్ ప్యాకెట్లను మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. తిరుపతి గ్రామీణ మండలం గాంధీపురం పంచాయతీలో 15 వేల ఆపిల్ జ్యూస్ ప్యాకెట్లను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని జ్ఞానశేఖర్ రెడ్డి చెప్పారు. యోగా చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details