శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గరుడసేవ నాడు అలంకరించే గొడుగులు చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో హిందూ ధర్మార్థ సమితి.. 11 గొడుగులను తితిదేకు అందిస్తుంది. ట్రస్టీ ఆర్.ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో గొడుగులతో తిరుమలకు చేరుకున్న వారికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఆలయం ముందు గొడుగులను అధికారులకు అందించారు.
చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు 11 గొడుగులు - tirumala bhramostavalu latest news
చెన్నై నుంచి ఊరేగింపుగా 11 గొడుగులు తిరుమల చేరుకున్నాయి. రేపు రాత్రి జరిగే గరుడ వాహన సేవలో గొడుగులను అలంకరణ చేయనున్నారు. గొడుగులతో తిరుమలకు చేరుకున్న వారికి తితిదే ఛైర్మన్ స్వాగతం పలికారు.
srivari godugulu