స్వాధీనం చేసుకున్న నగదును లెక్కిస్తున్న పోలీసులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ 13 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్ పోస్టు వద్ద 8 లక్షల 79 వేల రూపాయల లెక్కలు, పత్రాలు లేని పట్టుకున్నారు. మరో.. గంట వ్యవధిలోనే ఇచ్ఛాపురం బస్టాండ్ వద్ద 4 లక్షల 30 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విశాఖపట్నానికి కారులో వెళ్తున్న వ్యక్తి వద్ద ఈ నగదును గుర్తించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినఈ నెల 11 నుంచి చేపడుతున్న తనిఖీల్లో ఇప్పటిదాకా సుమారు 19 లక్షల దాకా నగదు పట్టుబడినట్లు ఇచ్ఛాపురం పట్టణ సీఐ పైడి నాయుడు తెలిపారు.