"రాష్ట్రంలో విచ్చలవిడిగా జే ట్యాక్స్ వసూలు" - kala venkatarao news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత కిమిడి కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత స్పష్టించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పైస్థాయి నుంచి కింది వరకూ జే టాక్స్ వసూలు చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. కాకినాడలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ భవన నిర్మాణ కార్మికుడు కుటుంబ సభ్యులని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం పగలు కూల్చివేత, సాయంత్రం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత స్పష్టించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగితే పైనుంచి చూసి వెళ్లారని విమర్శించారు. ప్రజలు చనిపోతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు.