ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

28న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా: నాదెండ్ల - ఏపీలో రైతుల కష్టాలు వార్తలు

ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కర్షకులకు సాయం చేయాలన్న డిమాండ్​తో ఈ నెల 28న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు.

nadendla manohar
nadendla manohar

By

Published : Dec 20, 2020, 2:52 PM IST

వరదలు, తుపాన్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయనున్నట్టు జనసేన ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్​లో ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమహేంద్రవరంలో అన్నారు. 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.... రైతులకు 30 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. కర్షకులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

మరోవైపు రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని.... అది అమరావతే కావాలని మనోహర్ ఆకాంక్షించారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు విడతల వారీగా కొనసాగుతున్నాని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details