రాజమహేంద్రవరం నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణల కలిసి ఎంపీ భరత్ చేపట్టిన 'హరిత-యువత' గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం కంబాల చెరువు పార్కులో రూ.6 కోట్ల 54లక్షలతో నిర్మించిన డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించారు.
రాజమహేంద్రవరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతాం: బొత్స - botsa satyanarayana Latest News
రాజమహేంద్రవరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో పర్యటించిన ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్ ఉన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
తుమ్మలావలో 89 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. జాంపేటలో 4కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక జంతు వధుశాలను ప్రారంభించారు. అనంతరం నగరపాల సంస్థ కొత్త వెబ్సైట్, మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
ఇదీ చదవండీ... హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు