DHAVALESWARAM:గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం వద్ద అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి పంట కాల్వలకు 7 వేల 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 14 లక్షల 70 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
SRISAILAM: శ్రీశైలం జలశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 213.40 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 46,123 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.