కొవిడ్ కారణంగా.. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయస్థానంలో.. పెండింగ్ కేసుల పరిష్కారానికి వర్చువల్ లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. ఈ విధానం ద్వారా 1195 కేసులను ఆన్లైన్లో విచారించనున్నట్లు తూర్పుగోదావరి జిల్లాకోర్టు న్యాయమూర్తి బబిత తెలిపారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా.. వివిధ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారని వివరించారు. ఈసారి ఎక్కువ కేసులు పరిష్కారం అవ్వనున్నాయని న్యాయమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానంలో వర్చువల్ లోక్ అదాలత్ - వర్చువల్ లోక్ అదాలత్ తాజా వార్తలు
కొవిడ్ కారణంగా.. పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయస్థానంలో వర్చువల్ లోక్ అదాలత్ను ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లాకోర్టు న్యాయమూర్తి బబిత తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం, చిన్నారుల బిక్షాటనను నిర్మూలించడంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి బబిత పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానంలో వర్చువల్ లోక్ అదాలత్
ఇప్పటివరకు 200 మందికి న్యాయసాయం అందించామని చెప్పారు. వివిధ కేసుల్లో సుప్రీం, హైకోర్టు మంజూరు చేసిన రూ.52 లక్షల పరిహారాన్ని బాధితులకు అందించామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం, చిన్నారుల బిక్షాటనను నిర్మూలించడంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు న్యాయమూర్తి బబిత పేర్కొన్నారు.