ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VADAPALLI: వాడపల్లిలో వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - East Godavari district SP

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

VADAPALLI
వాడపల్లిలో వైభవంగా వేంకటేశుని బ్రహ్మోత్సవాలు

By

Published : Oct 31, 2021, 8:00 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామి వారిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ప్రభుత్వ విప్ జగ్గి రెడ్డి, రాజమహేంద్రవరం రూడా ఛైర్మన్ షర్మిలారెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

స్వామివారి దర్శనానికి వచ్చిన ఎస్పీ, ప్రభుత్వ విప్​లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవలో పాల్గొని స్వామివారి పల్లకిని ఊరేగించారు. స్వామివారి చిత్రపటాన్ని దేవాదాయ శాఖ అధికారులు వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు దీపాలంకరణ కార్యక్రమాన్ని వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details