Union Minister Narayana Swamy: కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేకపోయిందని కేంద్రమంత్రి నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. ఉభయగోదావరి జిల్లాలు, మచిలీపట్నం భాజపా నాయకులతో గురువారం రాజమహేంద్రవరంలో సమావేశమైన ఆయన.. దళిత సంఘాలు రక్షణ కావాలని తనను కోరాయని తెలిపారు. ఎస్సీలపై దాడులు పెరిగాయని, పేదలకు ఇళ్లస్థలాలు లేవని వాపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగ, మాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. అక్కడ బోర్డు తప్ప కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని విమర్శించారు. అమరావతి రాజధానికి రూ. 7,500 కోట్లు ఇచ్చామని.. 7 ఈఎస్‌ఐ ఆసుపత్రులు, రూ. 40 వేల కోట్ల నిధులతో 20.4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. 14 జాతీయ విద్యాసంస్థలు, 4 స్మార్ట్‌సిటీలు ఏర్పాటు చేశామని వివరించారు.
డబ్బులిచ్చినా పోలవరం కట్టలేకపోయారేం?: కేంద్రమంత్రి నారాయణస్వామి - కేంద్రమంత్రి నారాయణస్వామి
Union Minister Narayana Swamy: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేకపోయిందని కేంద్రమంత్రి నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానికి రూ. 7,500 కోట్లు ఇచ్చామని.. 7 ఈఎస్‌ఐ ఆసుపత్రులు, రూ. 40 వేల కోట్ల నిధులతో 20.4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
భాజపా సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి నారాయణ స్వామి
రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందనీ.. ఉభయ ప్రాంతీయ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్రం అమరావతికి రూ. 7,500 కోట్లు ఇస్తే రాజధానే లేకుండా చేశారన్నారు. రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరాజు, బిట్ర శివన్నారాయణ, ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, మాలతీ రాణి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణమెలా..? కలెక్టర్‌ను ప్రశ్నించిన వృద్ధుడు