ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదావరి వంతెనపై రైళ్ల గరిష్ఠ వేగం పెంపు - రైళ్ల గరిష్ఠ వేగం పెంపు

రాష్ట్రంలోని గోదావరి - కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న వంతెన (రాజమహేంద్రవరం)పై రైళ్ల గరిష్ఠ ప్రయాణ వేగాన్ని రైల్వేశాఖ పెంచింది. గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాన్‌ వంతెనపై గతంలో రైళ్లు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించేవి. ఏప్రిల్‌ నుంచి 40 కి.మీ.కి పెంచారు. ఇటీవల రైలు పట్టాల కింద ఉండే స్లీపర్లను మార్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గోదావరి వంతెనపై రైళ్ల గరిష్ఠ వేగం పెంపు
గోదావరి వంతెనపై రైళ్ల గరిష్ఠ వేగం పెంపు

By

Published : Jul 28, 2022, 9:30 AM IST

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న వంతెన (రాజమహేంద్రవరం)పై రైళ్ల గరిష్ఠ ప్రయాణ వేగాన్ని రైల్వేశాఖ పెంచింది. గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాన్‌ వంతెనపై గతంలో రైళ్లు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించేవి. ఏప్రిల్‌ నుంచి 40 కి.మీ.కి పెంచారు. ఇటీవల రైలు పట్టాల కింద ఉండే స్లీపర్లను మార్చారు. ట్రాక్‌ను పటిష్ఠం చేశారు. 50 కి.మీ. గరిష్ఠ వేగంతో నడిపేందుకు నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనట్లు ద.మ. రైల్వే బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏపీలోని విశాఖపట్నం సహా తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లు వంతెనపై మరింత వేగంతో పరుగులు పెట్టనున్నాయి. వంతెనపై రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల రద్దీ తగ్గడం, రైలు సర్వీసుల నిర్వహణ సులువు కావడం, సమయపాలన పెరగడం వంటి ప్రయోజనాలున్నాయని ద.మ. రైల్వే తెలిపింది. సంబంధించిన పనులను సమర్థంగా పూర్తి చేసిన సిబ్బందిని, ఇంజినీరింగ్‌ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details