ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

East Godavari District: జోరుగా కోడిపందేలు.. ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు - కోడి పందేలు

ఆత్రేయపురంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఈ పందేల కారణంగా రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పందేలను చూసేందుకు భారీగా తరలివచ్చి జనం.. తమ వాహనాలను రోడ్లపైనే పార్క్ చేయడంతో.. మిగతా వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

traffic jam at atreyapuram
traffic jam at atreyapuram

By

Published : Jan 15, 2022, 4:36 PM IST


తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న కోడిపందేల నేపథ్యంలో.. రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఫలితంగా.. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పేరవరం, రావులపాలెం, బొబ్బర్లంక రహదారి పక్కన కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

East Godavari District: జోరుగా కోడిపందేలు.. ప్రయాణికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు

ఈ పందేలు చూసేందుకు వచ్చిన జనం.. వారి వాహనాలను రోడ్లపైనే నిలపడంతో.. మిగతా వాహనాలకు దారి లేకుండాపోతోంది. దీంతో.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో అటుగా వెళ్లే ప్రయాణీకులు నానా అవస్థలు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details