ప్రధాన వార్తలు @ 3 PM
By
Published : Jun 7, 2021, 3:04 PM IST
| Updated : Jun 7, 2021, 3:26 PM IST
- సమ్మె సైరన్
రాష్ట్రంలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈనెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్లు జూనియర్ రెసిడెంట్ వైద్యులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అవినీతిని ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే సంకెళ్లు'
ఆనందయ్య మందును సొమ్ము చేసుకునేందుకే అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆనందయ్య మందు పంపిణీలో ప్రభుత్వ పెద్దలు పాల్గొంటున్నారని విమర్శించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు అనుమతి!
ల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న ఔషధాల్లో ఒకటైన ‘కె’ మందుకు.. హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. కంట్లో వేసే చుక్కల మందు సహా ‘కె’ మందుకు అనుమతి ఇవ్వలేదు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ధరలో పెరుగుదలలో వికాసం'
దేశంలో పెరుగుతోన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వ హయాంలో ధరల పెంపులో వికాసం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రెండో దశతో దేశం చిన్నాభిన్నమైన నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌లో ఘర్షణలు
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు, భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 119 మంది మృతి చెందారు. వారిలో 17 మంది పౌరులు ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ప్రణాళికలు
మహిళలు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆర్థిక విషయాల పరంగా కూడా మహిళలు పురోగతి సాధిస్తున్నారు. ఇంకా ఎంతో మంది వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రాంతీయ భాషల్లోనూ మ్యాచ్ ప్రసారం!
భారత్-న్యూజిలాండ్ మధ్య జూన్ 18న జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) కోసం ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ (Star Sports) స్పాన్సర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మ్యాచ్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టెలికాస్ట్ చేయనున్నారట. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఓటీటీ రిలీజ్‌పై నిర్మాత స్పష్టత
ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ నటించిన 'గుడ్‌లక్ సఖి'(Good Luck Sakhi).. దాదాపు ఏడాది నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీలో విడుదల కానుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాత సుధీర్ చంద్ర స్పందిస్తూ.. రిలీజ్‌పై చిత్రబృందం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
Last Updated : Jun 7, 2021, 3:26 PM IST