ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ap top ten news

.

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Nov 10, 2021, 7:00 PM IST

  • CM JAGAN REVIEW: హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి: జగన్​
    రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అత్యాధునిక వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సకల సదుపాయాలతో ఆస్పత్రులను నెలకొల్పాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పీఆర్‌సీ నివేదిక ఇచ్చేవరకు కదలం..సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన
    పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ఏపీ జెఎసీ, అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్​ కలిశారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసే వరకు సచివాలయం నుంచి కదలబోమని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చట్టం తీసుకురావాలి'
    ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్య నారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, చంద్రశేఖర్ రెడ్డిని నియమించిన తీరు అలాగే కనిపిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 348 కరోనా కేసులు.. 3 మరణాలు
    రాష్ట్రంలో(ap corona cases) గడిచిన 24 గంటల్లో 348 కరోనా పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,220 యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి. ఈ మేరకు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శానిటరీ ప్యాడ్స్​లో 2.4 కేజీల బంగారం- లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్
    ఎయిర్ ఇండియా విమానంలో పనిచేస్తున్న ఓ మహిళ.. శానిటరీ ప్యాడ్స్​లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు (Gold Smuggling news) యత్నించింది. చివరకు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. మహిళ వద్ద నుంచి 2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నీటిలో తేలే 'వండర్ హౌస్​'- వరదలు వచ్చినా బేఫికర్!
    వరదలు వచ్చినా తట్టుకుని నిలబడి, నీటిలో తేలియాడేలా అద్భుత ఇంటిని నిర్మించారు కేరళకు చెందిన ఓ వ్యక్తి. సిమెంటు, ఇటుక, కాంక్రీట్ లేకుండా కట్టిన ఈ వినూత్న ఇంటి విశేషాలేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఐరోపాలో కరోనా ఉగ్రరూపం.. ఇలానే కొనసాగితే ఐదు లక్షల మరణాలు...'
    ఐరోపా మినహా అన్ని చోట్లా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. అయితే ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదు లక్షల మరణాలు నమోదవుతాయని వారాంతపు నివేదికలో హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్​ డోసు!'
    కొవిడ్ వ్యాక్సిన్​ రెండో డోసు అందుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనువైన సమయం అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. నాజల్​ వ్యాక్సిన్​ను బూస్టర్​ డోసుగా ఇచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యువ బౌలర్​ మ్యాజిక్.. రెండు రోజుల్లో రెండు ఘనతలు
    సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భ బౌలర్​ రికార్డు సృష్టించాడు. ఓ మ్యాచ్​లో నాలుగు మెయిడిన్​ ఓవర్లు వేశాడు. తర్వాతి మ్యాచ్​లో హ్యాట్రిక్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాలకృష్ణ కొత్త సినిమా, చిరంజీవి 'భోళా శంకర్' అప్డేట్స్​
    మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రాల అప్డేట్స్​తో వచ్చేశారు. రెండు రోజుల వ్యవధిలో వీరి సినిమాలు గ్రాండ్​గా లాంచ్​ కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details