పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యమైన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పునర్ విభజన చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వటంతో పాటు పునరావాసం కూడా కల్పించాలని స్పష్టం చేశారు. కానీ కేంద్రం ఆ విషయంలో నోరు విప్పడం లేదని.... ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. పోలవరంలో ఎలాంటి పనులు జరగడం లేదని వెల్లడించారు. ఇటీవల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం రూ.1800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం మద్యం బకాయిలు చెల్లించడానికి, అరోగ్యశ్రీ పథకానికి ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు పనులు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపితే జాతి క్షమించదని ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
'పోలవరంలో ఎలాంటి పనులు జరగడం లేదు' - సీఎం జగన్‌పై ఉండవల్లి వ్యాఖ్యలు
పోలవరంలో తూతూ మంత్రంగానే పనులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల కేంద్రం కొంత నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేరే పథకాలకు వినియోగించిందని ఆరోపించారు.
undavalli arun kumar
పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాజమహేంద్రవరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు ఉండవల్లి లేఖ రాశారు. 14 ఏళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బెంచ్ ఏర్పాటుపై ప్రతిపాదించారని ఉండవల్లి గుర్తు చేశారు.