ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీ లేదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. అది పూర్తిగా ప్రైవేటు సమావేశమేనని అభిప్రాయపడ్డారు. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రి హస్తినలో పర్యటించారని ఆరోపించారు. ప్రధానితో ఏం మాట్లాడారో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం దిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం: జవహర్ - తెదేపా నేత జవహర్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై తెదేపా నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఏ అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ex minister jawahar
అలాగే అపెక్స్ సమావేశం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జవహర్ సమక్షంలో 40 మంది తెదేపాలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వాసు పాల్గొన్నారు.