ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మించటానికి అవసరమైన కలపను ఆలయం వద్దకు చేరవేసే కార్యక్రమం నేటి నుంచి మెుదలైనట్లు ఆలయ సహాయ కమిషనర్ వై.భద్రాజి తెలిపారు.

antarvedi
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి

By

Published : Sep 22, 2020, 2:49 PM IST


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రథం దగ్ధం కావడంతో నూతన రథం నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త రథం తయారీకి కావాల్సిన కలపను నేటి నుంచి ఆలయం వద్దకు చేరవేస్తున్నారు. 1,330 ఘనపుటడగుల కలప అవసరమని గుర్తించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వై.భద్రాజి తెలిపారు. రావులపాలెం నుంచి కలపను తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details