ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన భూముల్లో వరద నీరు - east godavari news

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు .... పేదల ఇళ్ల స్థలాల కోసం తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి సమీపంలో ప్రభుత్వం సేకరించిన ఆవ భూమి పూర్తిగా నీట మునిగింది.

The land acquired for housing for the poor near Burugapudi in the Korokonda zone of East Godavari district was completely submerged.
పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన భూముల్లో వరద నీరు

By

Published : Aug 18, 2020, 7:55 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగపూడి సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూమి పూర్తిగా నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకే దాదాపు 587 ఎకరాల భూమి ముంపు బారిన పడింది. ముందు భాగంలో 4 అడుగుల లోతు, మధ్యలో 10 అడుగుల లోతు వరకూ నీరు చేరింది. బూరుగపూడి, కోరుకొండ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు సోమవారం నీటిలో దిగి పరిశీలించగా వారు నడుము భాగం వరకు మునిగిపోయారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ భూముల సేకరణపై స్థానిక ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సుమారు 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ భూమిని సేకరించారు. ఎకరం రూ.45లక్షల చొప్పున కొందరికి పరిహారం కూడా చెల్లించారు. ఈ ప్రాంతంలో ముంపు అధికమని జలవనరుల శాఖ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి భూములను సేకరించడం గమనార్హం. దీనిపై కోరుకొండ మండలానికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది.


ప్రభుత్వం వద్ద నివేదిక

న్యాయస్థానం స్టే ఇచ్చిన తర్వాత ఆవ భూముల భౌతిక స్థితిపై అధ్యయనం చేయడానికి జలవనరుల శాఖ నుంచి ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించింది. విజయవాడ హైడ్రాలజీ విభాగం చీఫ్‌ ఇంజినీరు పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు, సూచనలతో కూడిన సమగ్ర నివేదికను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీనిపై ధవళేశ్వరం సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు ప్రకాశరావుతో ‘ఈనాడు’ మాట్లాడగా ఆవ భూమి ముంపు ప్రభావం ఉన్న ప్రాంతమేనని తెలిపారు.

ఇవీ చదవండి:ఆస్తులు అమ్మవద్దని తితిదే తీర్మానించింది.. హైకోర్టులో ఈవో కౌంటర్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details