ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - గుంటూరలోని ఏసీ కళాశాల

గుంటూరు-కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల కౌంటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

teacher mlc elections counting
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

By

Published : Mar 16, 2021, 9:39 PM IST

Updated : Mar 16, 2021, 11:42 PM IST

గుంటూరు-కృష్టా, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు-కృష్ణా జిల్లాల స్థానానికి గుంటూరులోని ఏసీ కళాశాలలో, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడలోని జేఎన్​టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఐఈటీఈ బ్లాకులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

గుంటూరు-కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియను కెమెరాలో చిత్రీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు.. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Last Updated : Mar 16, 2021, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details