ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిబంధనలు పాటిద్దాం.. రాజమహేంద్రవరాన్ని సేఫ్​ స్పాట్​గా మారుద్దాం' - tdp leader gorantla twitter news

ప్రజలంతా నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన.. అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలను కోరారు.

'నిబంధనలు పాటించి.. రాజమహేంద్రవరాన్ని సేఫ్​స్పాట్​గా మారుద్దాం'
'నిబంధనలు పాటించి.. రాజమహేంద్రవరాన్ని సేఫ్​స్పాట్​గా మారుద్దాం'

By

Published : Jul 19, 2020, 3:22 PM IST

బుచ్చయ్య చౌదరి ట్వీట్​

కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. వైరస్​ మొత్తం రాజమహేంద్రవరంలోనే తిష్ట వేసినట్లుగా ఉందన్న ఆయన.. అనవసర ప్రయాణాలు వద్దని ప్రజలను కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

ఆతిథ్యానికి గోదావరి జిల్లాలు పెట్టింది పేరన్న బుచ్చయ్య చౌదరి.. కరోనాకు మాత్రం ఆతిథ్యం ఇవ్వొద్దని కోరారు. నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. రాజమహేంద్రవరానికి కరోనా 'హాట్​స్పాట్​' గా కాకుండా సేఫ్​స్పాట్​గా మారుద్దామని ట్విటర్​ వేదికగా పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details