Koppavaram Jathara: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరలో భాగంగా ఆదివారం అమ్మవారు నాగదేవతగా పూజలందుకున్నారు. మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో వివిధ రకాల వేషధారణలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి సందడి చేశారు. ఆచారంలో భాగంగా కొప్పవరంలోని పుట్ట వద్ద పూజలు చేసి తిరిగి ఆలయానికి చేరుకున్న పూజారులను ఆలయంలోకి వెళ్లకుండా విచిత్ర వేషధారణలు ధరించిన భక్తులు అడ్డుకున్నారు. భక్తులకు పూజారి బడిత పూజ చేశారు.ఇలా పూజారితో దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం పొందినట్లేనని నమ్మకంతో భక్తులు బడితె పూజ చేయించుకునేందుకు పోటీ పడ్డారు.
Koppavaram Jathara: విచిత్ర వేషధారణలు..పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం - Koppavaram Jathara
Koppavaram Jathara: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో సత్తెమ్మ తల్లి జాతర సందడిగా జరిగింది. విచిత్ర వేషధారణలు, భక్తుల పూజలు, పూజారి బడిత పూజ, బాణసంచా కాల్పులు, కుర్రకారు కేరింతలతో వైభవంగా సాగింది.
విచిత్ర వేషధారణలు..పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం
విచిత్ర వేషధారణలు, భక్తుల పూజలు, పూజారి బడిత పూజ, బాణాసంచా కాల్పులు, కుర్రకారు కేరింతల మధ్య సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది.
ఇదీ చదవండి :Lord Shiva Temples in AP: శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు