తూర్పుగోదావరి జిల్లా పెరుమళ్లాపురం గ్రామంలో 1940లో పేరురి అప్పాయమ్మ దంపతులు చిన్న కాకా హోటల్ ప్రారంభించారు. అక్కడ బెల్లం గారెలు స్పెషల్. పెరుమళ్లాపురం పేరు చెబితే బెల్లం గారెలు గుర్తొచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల 105 ఏళ్ల వయసులో అప్పాయమ్మ మృతి చెందారు. కుమారుడు, మనవడు ఆ బెల్లం గారెల రుచి ఏ మాత్రం పోకుండా... అదే వారసత్వం కొనసాగిస్తున్నారు. ఈ బెల్లం గారెల రుచి వారి వారసుల హయాంలోనూ ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. పలువురు అగ్రశ్రేణి సినీనటులు సైతం ఇక్కడి బెల్లం గారెలు రుచి చూసిన వారేనని స్థానికులు చెబుతున్నారు.
'వింటే భారతం వినాలి... తింటే పెరుమళ్లాపురం బెల్లం గారెలు తినాలి' - పెరుమాళ్లపురం బెల్లంగారెపై కథనం
తింటే గారెలు తినాలి అనేది నానుడి. అయితే... తూర్పు గోదావరి జిల్లా తునివాసులు మాత్రం తింటే పెరుమాళ్లపురం బెల్లంగారెలే తినాలంటున్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా 70 ఏళ్లుగా ఇక్కడ తయారు చేసే బెల్లం గారెలు స్థానికులకు నోరూరిస్తూనే ఉన్నాయి. పెరుమళ్లాపురం బెల్లం గారెలపై ఈటీవీ భారత్ కథనం..
పెరుమాళ్లపురం బెల్లంగారెపై కథనం