'శాసనసభలో ఒక నిర్ణయం తీసుకున్నాక అది అంతిమ నిర్ణయం అవుతుంది. దానిని శాసనమండలి వ్యతిరేకిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెదేపా నేతలు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారంటే వారి ఆలోచనా విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయడం వారికి ఇష్టంలేనట్లుగా ఉంది' - తమ్మినేని సీతారాం, సభాపతి
మండలి నిర్ణయంతో పనిలేదు
ఎంపీ భరత్, తనతో సహా అనేకమంది బీసీలకు ముఖ్యమంత్రి జగన్ మంచి అవకాశాలు కల్పించారని చెప్పారు. బడ్జెట్లోనూ అధిక శాతం కేటాయింపులు జరిపారన్నారు. గెలిచే అవకాశం లేనప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని రాజ్యసభ ఎన్నికల్లో ఎలా పోటీకి నిలబెట్టారని తెదేపా అధినేత చంద్రబాబును స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లులో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభదే అంతిమ నిర్ణయమన్న సభాపతి.. మనీ బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో శాసన మండలి నిర్ణయాన్ని పట్టించుకోనవసరం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెలుగుదేశం అడ్డుకుందని.. సంక్షేమ పథకాలు అమలు చేయడం తెదేపా నేతలు ఇష్టం లేదని విమర్శించారు.