ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sivarathri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు... ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు - ఏపీలో శివరాత్రి పూజలు

Sivarathri Celebrations : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. పరమేశ్వరుని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి.

Sivarathri Celebrations
రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు...ఆలయాల్లో ప్రత్యేక పూజలు,అభిషేకాలు..

By

Published : Mar 1, 2022, 9:18 AM IST

Updated : Mar 1, 2022, 2:19 PM IST

కృష్ణాజిల్లా...

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేశారు. జగ్గయ్యపేటలోని ముక్తేశ్వర క్షేత్రంలో స్వామి కల్యాణోత్సవం సందర్భంగా జరిగే తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులు తరలివస్తున్నారు.

కడప జిల్లా...

జిల్లాలో పురాతన పుష్పగిరి శివాలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మహిళలు దీపారాధన చేస్తున్నారు.

అనంతపురం జిల్లా .....

పెనుకొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం, ఐ ముక్తేశ్వరాలయం, నగరేశ్వర ఆలయం, సోమేశ్వరాలయం, భోగసముద్రం చెరువులోని మహాధ్యాన యోగీశ్వరమూర్తి ఆలయాల్లో... ఉదయం నుంచి స్వామివారికి హోమాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి జాగారం సందర్భంగా... భోగసముద్రం జల వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు.

నెల్లూరు జిల్లా...

జిల్లాలోని శివాలయాలకు వేకువజామునుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి... ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.మైపాడు బీచ్‌ ప్రాంతంలో కొలువైన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు.

కర్నూలు జిల్లా....

మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో కొలువైన మహనందీశ్వర స్వామిని... భారీఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. రెండేళ్లుగా మూసి వేసిన కోనేరు ఈసారి తెరుచుకోవడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

ఇదీ చదవండి :Shivaratri Story: మహా శివరాత్రి పర్వదినాన పూజ ఏ విధంగా చేయాలంటే..

Sivarathri Celebrations : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలను ఆయా దేవస్థానాలు ప్రత్యేకంగా అలంకరించాయి. పరమేశ్వరుని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో...

గిద్దలూరు పట్టణంలోని పాతాళ నాగేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు .తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

చినగంజాం మండలం సోపిరాలలోని బాలకొటేశ్వరస్వామి దేవాలయం, కొత్తపాలెంలోని కొటేశ్వరస్వామి దేవాలయాల్లో మహశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శివయ్యకు తెల్లవారుజామునుండే అభిషేకాలు, మహారుద్రాభిషేకలు నిర్వహించారు.... పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు.... రాత్రికి భారీ విద్యుత్ ప్రభలతో తిరునాళ్ళ ఉత్సవం జరుగనుంది.

మార్కాపురంలోని మార్కండేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3గంటల నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు. పొదిలోని శ్రీ నిర్మమహేశ్వర ఆలయయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల అభిషేకాలు పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జాము నుంచి భక్తులు బారులు తీరారు.. స్వామివారినీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం శివనామ స్మరణతో మారు మ్రోగింది. ఆలయ ప్రాంగణంలో అభిషేకములు నిర్వహించారు.

తణుకు గోస్తనీ నదీ తీరాన ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పురాణకాలం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారిని మహా శివరాత్రి రోజు దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.

నరసాపురం నియోజకవర్గంలోని పలు శైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. లక్ష్మణేశ్వరంలో సుప్రసిద్ధ దుర్గా లక్ష్మణేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా తెల్లవారు జాము నుంచి భక్తులు సమీప వశిష్ట గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నరసాపురంలోని కపీలమల్లేశ్వర,ఏకాంబరేశ్వర,అమరేశ్వర, విశ్వేశ్వర ఆలయాల్లోని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసారు. అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు.

ఆచంట లోని ప్రసిద్ధ శైవక్షేత్రం రామేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు .ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు.

ఉండ్రాజవరం లోని శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో రద్దీగా మారింది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి :Mahashivratri: ఈశ్వరుడు.. మేధా దక్షిణామూర్తిగా తపస్సు చేసింది ఈ కొండపైనే..

చిత్తూరు జిల్లా...

శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, వజ్ర కిరీటంతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని అలంకరించారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నాలుగు వరుసల్లో భక్తులకు మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. పసిపిల్లలకు పాలు బిస్కెట్స్ పంపిణీ చేస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత ప్రసాదాలను అందజేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా...

పంచారామక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి పుష్కరిణిగా పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.మొక్కులు చెల్లించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఐ పోలవరం మండలం మురమళ్ళలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కేంద్రపాలిత యానం శివాలయంలో రాజరాజేశ్వరీ సమేత రాజరాజేశ్వర స్వామికి... తాళ్ళరేవు మండలం కోరంగి లో కొలువై ఉన్న కురంగేశ్వర స్వామి కి... ముమ్మడివరంలోని శివాలయంలోనూ.. కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో కొలువైన కుండలేశ్వరం స్వామికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా....

కోటప్పకొండ లో మహాశివరాత్రి వేడుకలు....

రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి తొలిపూజ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంగళవారం ప్రారంభించారు. తెల్లవారుజామున 2 గంటలకు త్రికోటేశ్వరునికి బిందెతీర్ధంతో పలు అభిషేకాలు, పూజలు చేసి తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రారంభించారు. త్రికోటేశ్వరునికి నిర్వహించే తొలిపూజ వేడుకను తిలకించేందుకు భక్తులు సోమవారం రాత్రి నుండే ఆలయంలో బారులుతీరారు.

ఇదీ చదవండి :

Mahashivratri 2022: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇది మీ కోసమే!

Last Updated : Mar 1, 2022, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details