ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల పట్టివేత - rajamahendravaram latest news

కొవిడ్‌ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను రాజమహేంద్రవరం కేంద్రంగా బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకుడు వి.విజయ్‌శేఖర్‌ పర్యవేక్షణలో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి వారిని పట్టుకున్నామని ఔషధ తనిఖీ అధికారులు ఎ.కృష్ణ, బి.గోపాలకృష్ణ తెలిపారు.

Seizure of Remdesivir injections in Rajahmundry
రాజమహేంద్రవరంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల పట్టివేత

By

Published : May 3, 2021, 7:46 PM IST

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అమ్ముతున్న రాజమహేంద్రవరంలోని రంగ్రీజుపేటకు చెందిన మణికంఠకు రోగి బంధువులా ఫోన్‌ చేసి వైల్‌ అడుగగా రూ.50 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఔషధ తనిఖీ సిబ్బంది మాటు వేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు మణికంఠను పట్టుకున్నారు. అతన్ని విచారించగా రాజేంద్రనగర్‌లోని ప్రిన్స్‌ వ్యాక్సిన్‌ హౌస్‌ నిర్వాహకుడు నామాణి పురుషోత్తం, కొంతమూరుకు చెందిన గోపీనాథ్‌ ఇద్దరు హైదరాబాద్‌లోని రామిరెడ్డి అనే వ్యక్తితో కలిసి ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ పార్సిల్‌ ద్వారా రెమ్‌డెసివిర్‌ వైల్స్‌ను తెప్పిస్తున్నట్లు తేలిందన్నారు.

రూ.3,490 ఉన్న వైల్‌ను రూ.50 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు వివరించారు. ఇతర ఔషధాలను సైతం స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను నల్లబజారులో విక్రయిస్తున్న ఇద్దర్ని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వారి నుంచి రెండు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు అధికారిక సమాచారం ఇవ్వలేదు.

ABOUT THE AUTHOR

...view details