తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని రాయవరం గ్రామస్తులైన కొందరు... తమకు త్రాగు నీరు, విద్యుత్ వసతులను గ్రామసర్పంచ్ నిలిపివేయించారని ఆరోపిస్తూ.. మీడియాను ఆశ్రయించారు. వైకాపా బలంతో విజయం సాధించిన ఆయన.. ఎన్నికల్లో తాము ఓటు వేయలేదన్న ఆరోపణలతోనే ఇలా చేస్తున్నారని ఆవేదన చెందారు.
గత 10 రోజులుగా గ్రామంలోని.. సుమారు 30 కుటుంబాలకు విద్యుత్, త్రాగునీరు నిలిచిపోయిందని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే పలు సార్లు అధికారులను ఆశ్రయించినా.. ఎటువంటి స్పందనా లేదంటున్నారు. కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితులను అనువుగా మార్చుకుని.. రాజకీయంగా తమను వేధిస్తున్నారని సీపీఐఎంఎల్ నేత గణేశ్ పేర్కొన్నారు.