.
రాజమహేంద్రి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు - రాజమహేంద్రి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాల తాజా న్యూస్ి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కళాశాల విద్యార్ధినులు చేపట్టిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. స్థానిక రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినులు సంక్రాంతి సంబరాల పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గంగిరెద్దు, సోదెమ్మ వేషధారణలు ఆకట్టుకున్నాయి. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సురేష్‌వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. విద్యార్థినుల కేరింతలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది.
రాజమహేంద్రి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు